Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్ నిర్ణయంపై మంత్రి శ్రీదర్ బాబుకు సర్పంచ్ స్వామి కృతజ్ఞతలు

డేంజర్ జోన్ నిర్ణయంపై మంత్రి శ్రీదర్ బాబుకు సర్పంచ్ స్వామి కృతజ్ఞతలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం బ్లాక్-1 ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను జెన్కో అధికారులు సేకరించి పరిహారం, ప్యాకేజి ఇప్పించాలని నిర్వాసితులు పలుమార్లు రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు చెసిన విజ్ఞప్తి మేరకు టిఎస్ జెన్కో సిఎండి,ఇతర అధికారులతో మాట్లాడి ఇండ్లకు సంబంధించిన సొమ్మును జిల్లా కలెక్టర్ ఖాతాలో వేసేలా చొరవ తీసుకోవడంపై డేంజర్ జోన్ భూ నిర్వాసితుల తరుపున గ్రామ సర్పంచ్ బండి స్వామి మంగళవారం మంత్రి శ్రీదర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రహదారులు మంజూరు చేయాలని కోరినట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -