నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ‌్రికా ఖండంలో ఉగాండ, కాంగో దేశాల్లో ఎబోలా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అనేక మంది వైరస్ బారినపడి మృతి చెందారు. వ్యాధి విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమైయ్యాయి. ఆయా దేశాల రాకపోకలపై నిఘా పెట్టారు. ఎయిర్‌పోర్టులో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే సదురు వైరస్‌ను కట్టడి చేయడానికి రష్యన్ శాస్త్రవేత్తలు ఒక టీకాను అభివృద్ధి చేశారని దక్షిణాఫ్రికాలోని రష్యన్ రాయబార కార్యాలయం తెలిపింది. కాంగోలో సంభవించిన వ్యాప్తికి కారణమైన అరుదైన ‘బుండిబుగ్యో’ రకం నుండి కూడా ఈ టీకా రక్షణ కల్పించవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది.
ఎబోలా వైరస్‌కు రష్యా టీకా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



