Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుల గణనలో విశ్వబ్రాహ్మణులుగానె నమోదు చేసుకోవాలి 

కుల గణనలో విశ్వబ్రాహ్మణులుగానె నమోదు చేసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : కుల గణ సర్వేలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి బుధవారం నవతెలంగాణకు తెలిపారు. ఇందులో కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి, శిల్పి, వృత్తుల వారిని వేరువేరు కులాలుగా పేర్కొనకుండా వారిని విశ్వబ్రాహ్మణ కులం గానే నమోదు చేయాలని ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిందని.. వేరువేరు కులాలుగా పేర్కొనడం వలన ప్రభుత్వ పథకాలలో తీరని అన్యాయం జరుగుతుందని.. జనాభా తక్కువగా కనపడుతుందని. అన్నారు. హైకోర్టు  ఆదేశాలు జారీ చేయడాని అఖిల భారతీయ విశ్వకర్మ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ.. కుల గణన సర్వేలో వచ్చే అధికారులు ఈ విషయాన్ని గమనించి కేవలం విశ్వబ్రాహ్మణ కులం గానే.. నమోదుచేసి విశ్వబ్రాహ్మణులకు అండగా నిలవాలని.. అలాగే ప్రభుత్వ పథకాలలో విశ్వబ్రాహ్మణులకు చేయూత అందించేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు. గౌడ సామాజిక వర్గం. చేనేత కార్మికులకు కుల వృత్తుల వారికి అందించే విధంగా విశ్వకర్మ సోదరులకు కూడా వారిలాగే 50 సంవత్సరాలకు పింఛను అందించాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -