నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భగీరథ్‌ను మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపి, మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించగా… న్యాయస్థానం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పోలీసులు చర్లపల్లి కేంద్ర కారాగారానికి చేరుకుని, భగీరథ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, భారీ భద్రత నడుమ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విచారణ ప్రక్రియ అంతా కూకట్‌పల్లి డీసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగుతోంది.
బండి భగీరథ్ ను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



