Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐదేళ్ళ లోపు పశువులకు సంతలో రానియోద్దు..

ఐదేళ్ళ లోపు పశువులకు సంతలో రానియోద్దు..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి: పశువుల వారంతపు సంతలో బక్రీద్ పండగను పురస్కరించుకొని ఐదేళ్ల లోపు పశువులకు సంతలో రానీయకుండా చూడాలని ఎస్ హెచ్ ఓ జీ సందీప్ కుమార్ కు ఆదేశించారు. బుధవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని గంగారం తాండా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి వారం నిర్వహించే వారంతపు పశువుల సంతకు ఆయన ఆకస్మికంగా సందర్శించి పశువుల క్రయ విక్రయాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణా నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ శాండీ మార్కెట్ (ఎద్దుల మార్కెట్) వద్ద తనిఖీలు చేపట్టి, పశువుల కొనుగోలు–అమ్మకాల వివరాలు, రవాణా పత్రాలు, అనుమతులను పరిశీలించారు. అనంతరం ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేసి, అక్రమంగా పశువులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పశువుల రవాణా సమయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సరైన పత్రాలు లేకుండా రవాణా చేయరాదని సూచించారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని అవగాహన కల్పించారు.బక్రీద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని ఏసీపీ ప్రకాష్ తెలిపారు.అయన వేంట ఇందల్వాయి ఎస్ హెచ్ ఓ జీ సందీప్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -