Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్క సుమన్ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

బాల్క సుమన్ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

– హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన మిలిటెంట్ యాక్టివిటీ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుని తక్షణమే అరెస్ట్ చేయాలని మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 27న బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో యువతను, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. నిరసనలు, ధర్నాలు వంటి కార్యక్రమాలను మానుకుని ఉద్యమాల బాట పట్టాలని, మిలిటెంట్ తరహా కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, సింగరేణి భవనాలను కూల్చివేయడం, రైలు పట్టాలను విరగొట్టాలని వ్యాఖ్యానించడం ద్వారా కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. బాల్క సుమన్ మాట్లాడిన వీడియోలు, పత్రిక క్లిప్పింగులను ఫిర్యాదుకు జత చేసి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో అందజేశామని తెలిపారు. బాల్క సుమన్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.

ఈ ఫిర్యాదులో స్థానిక కౌన్సిలర్ పూదరి వరప్రసాద్, కాంగ్రెస్ నాయకులు బూరుగు కృష్ణస్వామి, పున్న సది, మాజీ ఎంపీటీసీ భాస్కర్ నాయక్, గుగులోతు రాజు నాయక్, పున్న రంజిత్, దినేష్, భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -