Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అకాల వర్షం అన్నదాత ఆగం 

అకాల వర్షం అన్నదాత ఆగం 

- Advertisement -

వతెలంగాణ–పెద్దకోడప్ గల్  : మంగళవారం రాత్రి మండలం మరియు పరిసర ప్రాంత గ్రామాలలో కురిసిన అకాల వర్షంతో సహకార సంఘంలో ఉన్న జొన్న ధాన్యం వేల క్వింటాలు తడిసిపోయింది. కొంతమంది రైతులు ధాన్యం పైన కవర్లు కప్పి జాగ్రత్త పడ్డప్పటికీ విపరీతమైన విధుడు గాలుల వల్ల కప్పి ఉంచిన కవర్లు కొట్టుకపోవడంతో  అకాల వర్షానికి జొన్న దాన్యం కొంతమేరకు కొట్టుకుపోయింది. తెల్లవారుజామునుండే రైతులు తమ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్ట ప్రయత్నం చేశారు. ఓ రైతు తమ జొన్నల  వద్ద నిలిచిన నీటిని తొలగించడం చూసిన వారిని ఆవేదనకు గురిచేసింది.

నష్టం భరించేది ఎవరు…
సుమారుగా రెండు నెలలుగా  నుండిజొన్న జొన్నలు వచ్చినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయక నిర్లక్ష్యం వివరించడంతో ప్రతిసారి ఇదే సమయంలో జొన్న కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో అకాల వర్షాలతోని రైతులు అనేక నష్టాల పాలవుతున్నారని జొన్నలు వచ్చిన వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోల కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో, కొంతమంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు తమజొన్న ధాన్యాన్ని అమ్ముకోగా, మరి కొంతమంది రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే  అమ్ముకుంటామని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేంతవరకు ఎదురుచూసి ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించడంతో ఇక్కడే విక్రయిస్తున్నారు. ఇలాంటి సమయంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి  చాలామంది రైతుల జొన్న ధాన్యం తడిసి ముద్దయిపోయింది. ఈ నష్టాన్ని ఎవరు భరించాలి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జొన్న పొన్నువలను మరింత వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -