Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలి

గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలి

- Advertisement -

యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాబు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిలో గ్రేడర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న కొండ్ర వెంకటేష్ (32) అనే కార్మకుడు గుండె పోటుతో బుధవారం ఉదయం మరణించాడని, అతని కుటుంబానికి ఏఎమ్మార్ కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షల నష్ట పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఓపెన్ కాస్ట్ లో కోండ్ర వెంకటేష్ కార్మికుడు గత ఐదు సంవత్సరాలుగా గ్రేడర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తుండగా విధుల్లోనే హార్ట్ స్ట్రోక్ తో మరణించాడని తదనంతరం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లాలోని వంద పడకల ఆసుపత్రికి తీసుకొచ్చారని, యాజమాన్యం కార్మికుడి మృతి పట్ల పూర్తిస్థాయి బాధ్యత వహించి న్యాయం చేయాలని కోరారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోకపోతే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -