- బస్వాపురంలో బెల్లి లలితక్క 27వ వర్ధంతి
నవతెలంగాణ-హైదరాబాద్: భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో బెల్లి లలితక్క 27వ వర్ధంతిని గ్రామస్తులు మంగళవారం రాత్రి నిర్వహించారు.ఈ సందర్భంగా లలితక్క కుమారుడు సూర్యప్రకాశ్ యాదవ్, జన్ని వెన్నెలలు మాట్లాడుతూ.. లలితక్క గొల్ల కురుమ డోలు దెబ్బ, తన పాటల ద్వారా ప్రజలను సంఘటితం చేసి ప్రజలను చైతన్యం చేసిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడిందని ఆమె సేవలను కొనియాడారు. కొన్ని కిరాతక శక్తులు ఆమని అంతమొదించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు మాజీ ఎంపీటీసీ ఎశాల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేష్, సిపిఎం నాయకులు మద్దెపురం బాలనరసింహ, ఎండి రెహ్మాన్ మచ్చ భాస్కర్, ప్రజా సంఘాలు,వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్నం పట్ల బాలస్వామి, ముదిగొండ జమ్మయ్య, చిక్కుల పాండు, మేకల ఆంజనేయులు, హుస్నాబాద్ రసాల బాలస్వామి, రాసాల దయాకర్, రాసాల నరసింహ, చుక్కల వెంకటేష్, కడారి చందు, రాసాల సుధాకర్,నరాల సంపత్, ముదిగొండ బాలకృష్ణ, రాసాల రాజు మహేష్, గుంటి పవన్, శ్రీరామ్, మురళీకృష్ణ లలితక్క అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



