Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు  

మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు  

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను  
మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఆలేరు సర్క్లినిస్పెక్టర్ యాలాద్రి తెలిపారు. ఆలేరు పట్టణంలో సోమవారం మంతపురి రోడ్డు వద్ద  డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన గురించి యువకులకు అవగాహన కల్పించారు. యువకులు చెడు మార్గాల వైపు ఆకర్షితులు కావొద్దు అన్నారు. డ్రగ్స్, గంజాయికి బాధితులకు ఒకసారి అవకాశం ఇస్తున్నామని, బాధితులు పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. కౌన్సిలింగ్  ఇస్తామని, వార్నింగ్ ఇస్తామని వినని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు. మైనర్లు మద్యం సేవించవద్దని కోరారు. హెల్మెట్ పెట్టుకొని వాహనాలు జనసంచారంలో అతివేగంతో నడపవద్దని, రోడ్డు యమ నిబంధనలు పాటించాలని, సంయమనంతో    నడపాలని సూచించారు. వేగం వద్దని ప్రాణం వద్దని చెప్పారు. ఎస్ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమకు వ్యక్తిగతంగా, వాహనాలకు ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని, రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ యువకులు కనబడవద్దని, ఇళ్లకు పరిమితం కావాలని చెప్పారు. అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదన్నారు. కఠిన చర్యలు తప్ప ఉన్నారు. ఈ  అవగాహన కార్యక్రమంలో ఆయా కాలనీ వాసులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -