Monday, July 27, 2026
E-PAPER
Homeజిల్లాలుఅచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం

అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం

- Advertisement -

సంవత్సరం గడిచినా ప్రారంభం కానీ పనులు
మాజీ మున్సిపల్ చెర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్ 
నవతెలంగాణ-అచ్చంపేట
అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందని, సంవత్సరం గడిచినా వివిధ కాలనీలో పనులు ప్రారంభం కాలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ విమర్శించారు. సోమవారం మాజీ కౌన్సిలర్లు మన్ను పటేల్ రమేష్ రావులతో కలిసి ఐదవ వార్డులో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన స్థానికులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ లోని వివిధ వార్డులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తీరు ఉందని ఆరోపించారు. గత సంవత్సరంలో రూ.3. లక్షల డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ శంకుస్థాపన చేశారనీ, ఇప్పటికీ ఆ పనులు మొదలు పెట్టలేదని దుయ్యబట్టారు. దీంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతోందని, ఆ దుర్వాసనకు కాలనీవాసులు రోగాలబారిన పడుతున్న సంగతి తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. తక్షణమే ఎమ్మెల్యే వంశీకృష్ణ, మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీలను త్వతరగతిన పూర్తిచేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -