- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో 1వ వార్డు గణేష్ నగర్ సమీపంలో ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులు దోనకొండ లాస్య కృష్ణ, తన సొంత నిధులతో, పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని మహేంద్ర శర్మ ఇంటి వద్ద పిచ్చి మొక్కలు డోజర్ తో తొలగించారు. పారిశుధ్య సమస్య, పిచ్చి మొక్కల సమస్య ఉందని, ఇళ్లలోకి పాములు, తేళ్లు ఉన్నాయని కాలనీవాసులు తాన దృష్టికి తీసుకురావడంతో స్పందించానని వారు తెలిపారు. వార్డు కౌన్సిలర్, వార్డు అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మహేందర్ శర్మ, వినోద్, రసూల్, యాదగిరీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



