- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో నిలిపిఉంచిన అంత్యోదయ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలులోని ఓకోచ్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూలేకపోవడంతో ప్రమాదం తప్పింది. రైలును షంటింగ్ చేస్తున్న సమయంలో ఈఅగ్నిప్రమాదం సంభవించింది. రైలు పెట్టెల నుంచి దట్టమైన పొగలు, మంటలువ్యాపించడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
- Advertisement -



