నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : జిల్లా మండల వ్యాప్తంగా ఇటీవల కాలంలో కుక్కల దాడులు పెరిగాయని, రక్షణ కోసం ప్రభుత్వం గొర్రెల మేకల పెంపకం దారులకు ప్రత్యేక రాయితీతో గొర్రెల మేకలు షెడ్ల నిర్మాణం చేపట్టాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గొర్రెల మేకల పెంపకార్ల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండలంలోని అనాజిపురం, నమాత్ పల్లి గ్రామాలలో మందల వద్దకు వెళ్లి గొర్రెల మేకల పెంపకందారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గొర్రెల మేకల పెంపకం దారులు కుక్కల దాడిలో లక్షలాది రూపాయలు కాపర్లు నష్టపోతున్నారని, వెంటనే ప్రభుత్వం షెడ్ల నిర్మాణం చేపట్టి, కుక్కల దాడి నుంచి మూగజీవాలను రక్షించాలని కోరారు.
వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వెంటనే ప్రభుత్వం మందులను అందుబాటులో ఉంచి, అవసరమైనప్పుడు టీకాలు ఉచితంగా వేయాలని కోరారు. ప్రస్తుతం పెంపకం దారులు అమ్మ తల్లి టీకాలు అడుగుతున్నారని, ప్రభుత్వం వెంటనే అమ్మ తల్లి టీకాలు అన్ని గ్రామాలలో అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి ఎం పి ఎస్ జిల్లా కమిటీ సభ్యులు కడారి కృష్ణ, మండల కార్యదర్శి పాక జహంగీర్, మండల అధ్యక్షులు దేవునూరి బాలయ్య, మండల ఉపాధ్యక్షులు పార్వతి దశరథ, గొర్రెల మేకల పెంపకార్ల సంఘం నాయకులు తెలజూరి మల్లేష్, గంగన బోయిన పాండు, తోటకూర లక్ష్మయ్య, గంగనబోయిన బాల నరసింహ, శ్రీరామ్ అంజయ్య, శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీరామ్ కృష్ణ, శ్రీశైలం, నరసింహ సైదులు, ఎల్లంల వెంకటేష్, బీన బోయిన మల్లయ్య, గుండెబోయిన దానయ్య, దండేబోయిన వెంకటేష్, గొర్ల జంగయ్య, ఆంజనేయులు, సత్యనారాయణ, రాములు మల్లయ్య, దానయ్య, సిద్ధులు పాల్గొన్నారు.



