Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చండూర్ లో ఘనంగా బక్రీద్ వేడుకలు

చండూర్ లో ఘనంగా బక్రీద్ వేడుకలు

- Advertisement -

 నవతెలంగాణ – చండూర్  : చండూరు పట్టణంలోని గురువారం బక్రీదు పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చండూరు ఎస్సై శివ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మత గురువు ముజాహిద్ మాట్లాడుతూ విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ పండుగ అని, ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ త్యాగ నిరతికి, ధర్మ నిబద్ధతకి ప్రతీక ,అని ఆయన అన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బక్రీద్ పండుగ జరుపుకున్నారు. అనంతరం  ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు కలిసి శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమ్రుద్దీన్, కరెంట్ షరీఫ్, ఏజాస్, నిరంజన్ అలీ, జిన్నా, సాదక్, షజ్జు పాష, ఉమర్, ఖలీల్, యూనస్, ముజ్జు, లతీఫ్ పాష, రహీం బాబా, హైమద్, జమీల్, షరీఫ్, జన్ను, వహీద్, అజీమ్, మాజిద్, ముస్తఫా, రఫీ, జావీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -