Thursday, May 28, 2026
E-PAPER
Homeఆటలువినేశ్ ఫొగాట్ కేసు కీలక మలుపు.. సుప్రీంను ఆశ్రయించిన డబ్ల్యూఎఫ్‌ఐ

వినేశ్ ఫొగాట్ కేసు కీలక మలుపు.. సుప్రీంను ఆశ్రయించిన డబ్ల్యూఎఫ్‌ఐ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్ లో పాల్గొనేందుకు రెజ్లర్ వినేష్ ఫోగట్ కు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ పిఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం పిటిషన్ విచారణకు జాబితా చేసింది. 2026 ఆసియా క్రీడల కోసం జరగనున్న ట్రయల్స్ లో వినేష్ ఫోగట్ పాల్గొనడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రసూతి విరామం అనంతరం తిరిగి వస్తున్న ఆమెను పరిగణనలోకి తీసుకోకపోవడంతో డబ్ల్యుఎఫ్ఐ ఎంపిక విధానం వివక్షా పూరితంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 30, 31 తేదీల్లో జరగనున్న ఎంపిక ట్రయల్స్‌ను డబ్ల్యు ఎఫ్ ఐ వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ ఎ ఐ), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) నుండి ఒక్కో స్వతంత్ర పరిశీలకుడు కూడా ట్రయల్స్ కు తప్పక హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -