నవతెలంగాణ – చిన్నకోడూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటుగా మండల కేంద్రమైన చిన్నకోడూరు లో గురువారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే నూతన వస్త్రాలు ధరించి, ఈద్గా, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా చిన్నకోడూరుతో పాటు ఇబ్రహీం నగర్, గ్రామాల ముస్లిం సోదరులు ఈద్గా, దర్గల వద్ద మత గురువు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు కలీం మండల అద్యక్షుడు యండి అజీజ్,ప్రదాన కార్యదర్శి యూస్ బ్పొద్దిన్, క్యాషియర్ మహిపాషా, ఇమామ్, తాజోద్దిన్ బాబ, పక్ర్ ద్దిన్, సాజిద్, సలీమ్, రియాజ్, షకీర్ లతోపాటు ఆయా గ్రామాల ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా బక్రీద్ పండుగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



