- Advertisement -
నవతెలంగాణ – అలంపూర్
అలంపూర్ మండల పరిధిలోని సింగవరం(1) గ్రామపంచాయతీ సర్పంచ్ గొంగోల్ల ఈశ్వర్ సింగవరం-1 నుండి సింగవరం-2 గ్రామం చివరి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొంగోల్ల ఈశ్వర్ మాట్లాడుతూ.. చాలా రోజుల నుండి సింగవరం-1 ప్రజలు రోడ్డుకు అడ్డంగా పెరిగిన కంపచెట్లతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారని, వారి ఇబ్బందులను తొలగించేందుకు కంప చెట్లను తొలగించినట్లు తెలిపారు. కంపచేట్లను తొలగించినందుకు గాను గ్రామ ప్రజలు సర్పంచ్ ను అభినందించారు.
- Advertisement -



