Friday, May 29, 2026
E-PAPER
Homeమానవిజొన్నల్లో పోషకాలు మెండు

జొన్నల్లో పోషకాలు మెండు

- Advertisement -

జొన్నల్లో శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వంద గ్రాముల జొన్నల్లో 72.6 గ్రాముల పిండి పదార్థాలు, 10.4 గ్రాముల ప్రొటీన్, 6.7 గ్రాముల పీచు పదార్థం, 4.1 మిల్లీగ్రాముల ఐరన్, 13 మిల్లీగ్రాముల కాల్షియం, 20 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. అలాగే సోడియం, జింక్, మెగ్నీషియం, పాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలూ లభిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు జొన్నలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని ఎంజైములు పిండి పదార్థాల్ని గ్లూకోజ్‌గా మార్చడంలో సహకరించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో దీర్ఘకాలిక రోగాల ప్రమాదం తగ్గుతుంది. పీచు పదార్థం, ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ఆహారం. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. జొన్నలు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అలాగే శరీరంలో అదుపు లేకుండా పెరిగే క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో కూడా తోడ్పడతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -