Friday, May 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగోనె సంచుల కొరత

గోనె సంచుల కొరత

- Advertisement -

ధాన్యం కొనుగోళ్లు మరింత ఆలస్యం
కోతలు పూర్తయినా సమకూరని పరిస్థితి
అకాల వర్షాలతోనూ కష్టాలు
పలు జిల్లాల్లో రైతుల పరేషాన్‌

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ర్టాన్ని గోనె సంచుల కొరత వేధిస్తున్నది. రబీ పంట కోతలు పూర్తయి రెండు మూడు వారాలు అవుతున్నా సంచులు సమకూరలేదు. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను చివరి రోజుల్లో కాపాడుకునే అవకాశం లేకుండాపోతున్నది. మార్కెట్లకు పంపే పరిస్థితి అసలే లేదు. దీంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. దాదాపు అన్నీ జిల్లాల్లో గోనె సంచుల కొరత ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. వరి ధాన్యం రవాణా చేయాలన్నా, నిల్వ చేయాలన్నా గోనె సంచులు తప్పనిసరి. నిర్మల్‌, వికారాబాద్‌, మహబూబ్‌‌నగర్‌తోపాటు ఇతర జిల్లాల్లో గోనె సంచుల కోసం తిప్పలు తప్పడం లేదు. నిర్మల్‌ ‌జిల్లా సారంగాపూర్‌‌లో గన్నీ బ్యాకుల కోసం రైతుల మధ్య ఘర్షణ చోటుచేసు కోవడం గమనార్హం. ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాల(పీఏసీఎస్‌)‌కు గన్నీ బ్యాకులు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, అవీ ఇంకా అందుబాటులోకి రాలేదు. రాష్ర్ట ‌పౌరసరఫరాల సంస్థ ఈ బాధ్యత తీసుకు న్నప్పటికీ సమయా నుకూలంగా రైతులకు గన్నీ బ్యాగులను చేర్చడంలో విఫలమైంది. గోనె సంచుల వ్యవహారం రాష్ర్టంలో రాజకీయ సమస్యగా మారింది. రైతులకు కనీసం గోనె సంచులను సైతం సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష‍ాలు విమర్శిస్తున్నాయి. ధాన్యం కళ్లాల వద్ద ఉండటం, ఇప్పటికే దాదాపు నెలల తరబడి వేచిచూడాల్సి రావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కళ్లాల వద్దే కుప్పలుగా పోయడం, సర్కార్ కోనుగోళ్ల కోసం ఎదురుచూస్తుండటం దారుణం. వరి ధాన్యం కుప్పల కావలి రైతులు రాత్రింభవళ్లూ ఉండాల్సిన రావడంతో ఇబ్బందులు అధికమవుతున్నాయి. తెలంగాణలో 2026 రబీ సీజన్‌‌కు 1.41 కోట్ల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అంచనా. దీనిని సేకరిం చడానికి కనీసం 19.78 కోట్ల గోనె సంచులు అవసరం కానున్నాయి.

అధికార, ప్రతి పక్ష‍ాలు రాజకీయ విమర్శలు చేసుకోవడం మినహా రైతులకు గన్నీ బ్యాగులను సమకూ ర్చడంలో వెనుకబడు తున్నాయి. అయితే సర్కారు ఈ వాదనను అంగీకరిం చడం లేదు. 19.78 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయనీ, రోజుకు 13 వేల ట్రక్కుల ద్వారా 43 లక్ష‍ల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నట్టు రాష్ర్ట ఫౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి చెప్పారు. అలాగే 8,575 కేంద్రాల ద్వారా 43 వేల మంది సిబ్బందిని ఉపయోగించి ధాన్యం సేకరణ చేస్తున్నట్టు సర్కారు చెబుతున్నది. అయితే జిల్లాలో సర్కారు చెప్పిన పరిస్థితి కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల వెంట ధాన్యం రాశులు కండ్లకు కడుతు న్నాయి. ఇదిలా వుండగా లారీల కొరత రైతులకు శాపంగా మారింది. మిల్లులకు వెళ్లే కాంట్రాక్టర్ల లారీలు తిరిగి వచ్చేంత వరకు ధాన్యం రవాణా సాధ్యం కాదు. మిల్లు ఒక దగ్గర, పొలం ఇంకో దగ్గర ఉంటే , రైతులు వేచి చూడాల్సిం దే. సంచి లేకపోతే తూకం ఉండదు. లారీ టోకెన్‌ ‌రాదు. ఈనేపథ్యంలో రైతులకు అరిగోస తప్పడం లేదు. ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతుండటం ఒకింత రైతులకు మంచిదే అయినా, అకాల వానల మూలంగా ధాన్యం తడిచిపోతున్నది. దీంతో కుప్పలు పోసుకుని వేచిచూడాల్సి వస్తుండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -