Friday, May 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి, ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్

సింగరేణి, ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్

- Advertisement -

మినిమం వేజెస్ ఫిక్స్ అంటూనే కార్మికులకు అన్యాయం :కల్వకుంట్ల కవిత
టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్థన్

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి, ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్థన్, అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి కవిత సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ చైర్మెన్ గా పని చేసిన జనార్థన్ చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యమిస్తామని తెలిపారు. మినిమం వేజెస్ ఫిక్స్ చేశామంటూనే కాంగ్రెస్ సర్కార్ కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామని కవిత తెలిపారు. ఆ ప్రణాళిక తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని కవిత చెప్పారు. తమ పార్టీ సమసమాజ స్థాపన కోసం ఏర్పడిందని… తాము కచ్చితంగా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారుతామన్నారు. జనం బాట కార్యక్రమం లో ప్రస్తావించిన సమస్యల్లో 25 సమస్యలకు పరిష్కారం లభించిదని తెలిపారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై మనం ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి సమీక్షించి, ఉద్యమాలు చేయకండి మేము పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. నల్లగొండలో 35 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి పనులను జనంబాటలో ప్రస్తావిస్తే పనులను ప్రారంభించారని కవిత గుర్తు చేశారు. ఆరేళ్ల క్రితం మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి, అప్పటి సీఎం కు కార్మికులకు మినిమమ్ వేజేస్ రూ.20 వేలు ఉండాలని కోరారని కవిత గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా తానే ఆ క్యాటగిరీ కార్మికులకు రూ.16 వేల వేతనం ఇస్తామని గొప్పగా చెప్పి నయవంచనకు గురి చేశారని విమర్శించారు. సింగరేణిలో ఒక్క రూపాయితో అయ్యే పనులకు రూ.10 ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. జనార్థన్ సహకారంతో సింగరేణి కార్మికుల కోసం మరింత గట్టిగా పోరాడుతామని తెలిపారు. ఆర్టీసీ డ్రైవ్ర్ రాజు గౌడ్ బలిదానం చేసుకునేంత వరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీ ఊసెత్తలేదని కాంగ్రెస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొనాలని కోరిన ఆర్టీసీ డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తీసేసి పోరాడితే వెనక్కి తగ్గారని తెలిపారు. జనార్థన్ సహకారంతో ఆర్టీసీ కార్మికుల కోసం కూడా పోరాటం చేస్తామని తెలిపారు.

ఎన్టీఆర్, కేసీఆర్ కన్న ఉన్నతంగా కవిత
ఎన్టీఆర్, కేసీఆర్ కన్నా కల్వకుంట్ల కవిత ఉన్నతంగా ఆలోచించారని బోడ జనార్థన్ అన్నారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్, నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కేసీఆర్ వస్తే కవిత పాంచజన్యం పేరుతో ఐదు కీలకాంశాలతో ముందుకొస్తున్నారని తెలిపారు. మహిళ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాననీ, టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -