Friday, May 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిలీనం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

విలీనం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

- Advertisement -

వేం నరేందర్‌‌రెడ్డికి ఆర్టీసీ జేఏసీ వినతి
సర్కారు మాట మార్చడంపై అభ్యంతరం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. జూన్‌ ‌రెండున అపాయింటెడ్‌ ‌డేట్‌‌గా ప్రకటించాలని కోరింది. ఈమేరకు శుక్రవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రాజకీయ ప్రధాన సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. ఆయన నివాసంలో కలిసిన జేఏసీ నాయకులు గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, నిర్ణయాలను జేఏసీ చైర్మెన్‌ ఈదురు వెంకన్న, వైస్ చైర్మెన్‌ ఎం థామస్ రెడ్డి, కో కన్వీనర్ బి యాదగిరి, వి. బాబు, ఎన్‌ బుద్ద విశాల్, జి రవికిరణ్ వివరించారు. గుర్తింపు సంఘం ఎన్నికల కంటే ముందుగా జూన్ రెండో తేదీన విలీనానికి అపాయింటెడ్ డేట్‌‌గా ప్రభుత్వం ప్రకటించే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం తగిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. విలీనంపై పలు అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు
.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులను ఉద్దేశించి వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటుందని స్పష్టత ఇచ్చారు. అలాగే జూన్ రెండో తేదీన అపాయింటెడ్ డేట్ ప్రకటన గురించి, విలీన విధి విధానాలకోసం అధికారులు, కార్మిక సంఘాలతో కమిటీ వేసి, విలీనం సక్రమంగా చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఆంధ్రాలో ఆర్టీసీ ఉద్యోగులకు జరిగిన నష్టం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జరగకుండా కార్మిక సంఘాలు, అధికారులు , తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే విలీనంతో ఆర్టీసీ కార్మికులకు మేలు చేయాలని సీఎం భావిస్తున్నారని చెప్పారు. విలీనం సక్రమంగా,సజావుగా జరగడానికి నావంతు ప్రయత్నం చేస్తానని నరేందర్‌‌రెడ్డి భరోసా ఇచ్చినట్టు జేఏసీ ఒక ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -