Friday, May 29, 2026
E-PAPER
Homeనల్లగొండప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై తల్వార్ తాత పాదయాత్ర…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై తల్వార్ తాత పాదయాత్ర…

- Advertisement -

నవతెలంగాణ-మునుగోడు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై తల్వార్ తాత చేస్తున్న పాదయాత్ర గురువారం మునుగోడు మండలానికి చేరుకోవడంతో తెలంగాణ జేఏసీ రాష్ట్ర నాయకులు తోట నరసింహ చారి , వెదిరే పూలమ్మ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వెదిరే విజేందర్ రెడ్డి స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా తల్వార్ తాత మాట్లాడుతూ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు శిధిల అవస్థలకు చేరుకొని సౌకర్యాలు లేక ప్రభుత్వ బడులు మూతబడుతున్న పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను మరమతులు చేయకపోవడం దారణమని మండిపడ్డారు . యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నేరాలకు ఘోరాల కు పాల్పడుతూ కుటుంబాలను వీధిలో పడేస్తున్నారని అన్నారు. గంజాయి, డ్రగ్స్ , ధూమపానం మద్యం వల్ల అనారోగ్యాలకు గురై చిన్న వయసులోనే కుటుంబాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గంజాయికి బానిసైన యువకులను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అవగాహన కల్పించారు. చిన్నపిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల కంటి చూపుతో పాటు అనేకమైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. సెల్ ఫోన్ భూతం నుండి పిల్లలను రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే నష్టాలపై పోలీస్ , ట్రాఫిక్ , రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించినప్పటికీ తల్లిదండ్రులు పట్టించుకోకుండా చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చి పిల్లలను తల్లిదండ్రులు చెడు దారికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు . ఈ కార్యక్రమంలో తల్వార్ తాత టీం సభ్యులు డప్పు రమేష్ , తదితరులు ఉన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -