నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే డివిస్ సంస్థ లక్ష్యమని మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 16,20వ వార్డులలో మూతపడిన రెండు ఆర్వో వాటర్ ప్లాంట్లను డివిస్ లెబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పునరుద్ధరించారు. సుమారు రూ.12,77,000 ఆర్థిక సహాయంతో పునరుద్ధరించిన ఈ ప్లాంట్లను ప్రారంభించినట్లు వైస్ చైర్మన్ వినయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రజలకు స్వచ్ఛతను మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో డివిస్ యాజమాన్యం గతంలో కొన్ని పబ్లిక్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు పాడైన ప్లాంట్లను సైతం బాగుచేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం అభినందనీయమని, lడివిస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బత్తుల జయమ్మదాసు గౌడ్ మహమ్మద్ హన్నుబాయి మాజీ వైస్ ఎంపీపీ చిక్క నరసింహ నాయకులు బండారు నరసింహ,ఖయ్యూం పాషా, కానుగుల వెంకటయ్య,చిక్క శ్రీనివాస్ డివిస్ మేనేజరు బి.కిషోర్ కుమార్ ప్రతినిధులు బి. గణేష్,బి.మణికంఠ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.



