Friday, July 10, 2026
E-PAPER
Homeమహబూబ్ నగర్నూతన ఎస్సైని సన్మానించిన పవన్ ముదిరాజ్

నూతన ఎస్సైని సన్మానించిన పవన్ ముదిరాజ్

- Advertisement -

నవతెలంగాణ-ఊరుకొండ
నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల నూతన ఎస్సైగా విధుల్లో చేరిన ఎస్ఐ రమాదేవిని రాంరెడ్డిపల్లి గ్రామ యువ నాయకుడు పవన్ ముదిరాజ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో శాంతి భద్రతలు మరింత బలోపేతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరాన్ని వివరించారు. ప్రజల భద్రత, గ్రామాల అభివృద్ధి కోసం పోలీసులు ప్రజలకు మరింత చేరువగా ఉండాలని వినయపూర్వకంగా కోరారు. నూతన ఎస్ఐ తమ సేవల ద్వారా ప్రజలకు న్యాయం చేస్తూ, మండల ప్రజల అభిమానం పొందాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -