- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ (Peddi) సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 3వ తేదీన సాయంత్రం 8 గంటలకు ఒక ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించుకోవచ్చు. ఈ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి గరిష్టంగా రూ.600 ఉండాలి. సినిమా విడుదలయ్యే తేదీ జూన్ 4 నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.100 అదనంగా, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.125 పెంచుకోవచ్చు. ఈ 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు.
- Advertisement -



