Friday, May 29, 2026
E-PAPER
Homeజాతీయంపేలిన ఏసీ..సీసీఐ తొలి ఛైర్మన్ మృతి

పేలిన ఏసీ..సీసీఐ తొలి ఛైర్మన్ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఉన్న ఒక నివాసంలో గురువారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లోని ఎయిర్ కండిషనర్ (ఏసీ) ఇండోర్ యూనిట్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తొలి ఛైర్మన్, ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ (80) తీవ్ర పొగ పీల్చడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన్ను రక్షించే క్రమంలో గాయపడిన కుమారుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఏసీ పేలుడు వల్లే మంటలు వ్యాపించాయని, ఇందులో ఎలాంటి అనుమానాస్పద కోణం లేదని పోలీసులు నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -