నవతెలంగాణ – ఆలేర్ రూరల్ : ఆలేరు మండలం కొలనుపాక గ్రామపంచాయతీకి స్వర్గీయ గడ్డం మల్లయ్య పేరుమీద (జ్ఞాపకార్థం) వారి కుమారులు గడ్డం సిద్దులు అందజేసిన ఫ్రీజర్ బాక్సులు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడే ఈ ఫ్రీజర్ బాక్సులను మరమ్మతులు చేయించి తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని గ్రామపంచాయతీ సెక్రటరీ,సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులను కోరుతున్నారు. గ్రామంలోని నిరుపేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు ఫ్రీజర్ బాక్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, ప్రస్తుతం అవి పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.పాలకవర్గం చొరవ తీసుకొని దాతల సహకారంతో వాటిని రిపేర్ చేయిస్తే పేదలకు పెద్ద ఊరట కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.సమాజ సేవాభావంతో అందించిన ఈ సదుపాయం తిరిగి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నిరుపయోగంగా ఫ్రీజర్ బాక్సులు..పేదలకు అందే సేవలు ఎప్పుడు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



