Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి: ఎంపీడీవో బాలకృష్ణ

ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి: ఎంపీడీవో బాలకృష్ణ

- Advertisement -


నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బాలకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామపంచాయతీల వారీగా జె ఎస్ జె బి యాప్ ఎంట్రీలు ప్రతి గ్రామపంచాయతీలో 100 ఎంట్రీలు పూర్తి చేయాలన్నారు. ఈ హెచ్ ఎస్  ఎంట్రీలు, సర్వీస్ రిజిస్టర్ల నవీకరణ, స్కానింగ్ చేసి ఐఎఫ్ఎస్ఎంఎస్ లో అప్లోడ్ చేయాలని, రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామపంచాయతీలో ఈజీఎస్ కూలీల హాజరు 150 మంది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జూన్ 1, 2026న నిర్వహించనున్న ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఫైనల్ పేమెంట్ పూర్తైన ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇసుక బుకింగ్, పైకప్పు స్థాయి వరకు నిర్మాణం పూర్తయిన ఇండ్ల వివరాలు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన టెక్నికల్ సమస్యలు, ఆధార్ అప్డేషన్, మిస్‌మ్యాచ్‌లు, పెండింగ్ చెల్లింపుల అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ఎంపికలు, హరితహారం స్థలాల తీర్మానాలపై చర్చించారు. అనంతరం బసవన్న పల్లి గ్రామంలో జరుగుతున్న ఈజీఎస్ ఫార్మేషన్ రోడ్ పనులను ఎంపీడీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ హౌసింగ్ సుష్మ, ఏఈఈ హౌసింగ్ మహేష్, ఏపీఓ శృతి, పంచాయతీ కార్యదర్శులు, ఈసీ భాస్కర్, టీఏ రాజు, నరేష్ ఎస్‌ఏ, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -