Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ విద్యతో పిల్లల సమగ్ర అభివృద్ధి

అంగన్వాడీ విద్యతో పిల్లల సమగ్ర అభివృద్ధి

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలను శుక్రవారం రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీడబ్ల్యూఓ ఆడెపు భాస్కర్ అధ్యక్షతన, సీడీపీఓ జయప్రద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ చేతుల మీదుగా ఏడు నెలల చిన్నారులకు అన్నప్రాసన,మూడు సంవత్సరాల లోపు పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ భాస్కర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవడం, చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం ఎంతో అవసరమని, అంగన్వాడీ విద్యతో పిల్లల సమగ్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధు, డీఎంసీ కొండయ్య, ఎంఈఓ రాఘవులు,వైస్ చైర్మన్ తురుగ సౌజన్య, కౌన్సిలర్లు శ్రీధర్, రాకేష్ నాయక్,సూపర్వైజర్లు రాధా, అనూహ్య,పద్మావతి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -