Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యవేక్షణ లోపం..మిషన్ భగీరథ నీళ్లు మురికి కాల్వల పాలు 

పర్యవేక్షణ లోపం..మిషన్ భగీరథ నీళ్లు మురికి కాల్వల పాలు 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం కారణంగా భగీరథ నీళ్లు కాస్త వృధాగా పారుతున్నాయి. భీంగల్ పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందాల్సిన నీళ్లు కాస్త వృధాగా పారసాగాయి. భీంగల్ పట్టణ కేంద్రంలో బడా భీంగల్ చౌరస్తా నుండి బసంత్ రెడ్డి హాస్పిటల్ వెళ్లే రోడ్డు మార్గంలో మిషన్ భగీరథ పైపు నుంచి నీరు వృధాగా పోతున్నాయి.పట్టణాల్లో, గ్రామాలలో తాగునీరు అందక ప్రజలు అల్లాడుతుంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగా భగీరథ నీళ్లు వృధా అవుతున్నాయి. దీనికి ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణం అంటూ స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై సంబంధిత మిషన్ భగీరథ అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని ఆ కాలనీ కి వాసులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భగీరథ నీళ్లు వృధా కాకుండా ప్రతి ఇంటికి, ప్రతిరోజు భగీరథ నీళ్లు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -