- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి సవాయి సింగ్‌తో కలిసి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. అర్హులైన లబ్ధిదారులందరికి ప్రజా ప్రభుత్వం దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధనుంజయ్ పటేల్, శరద్ పటేల్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ చంద్రకాంత్, వార్డు సభ్యులు శివ, సురేష్, రమాకాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


