Saturday, May 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలు విడుదల

ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలు విడుదల

- Advertisement -

తొలివిడతలో రూ.2 వేల కోట్ల నిధులకు ఉత్తర్వులు
ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నిర్ణయం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ‌రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. వారి సుదీర్ఘకాల బకాయిలు రూ. ఆరు వేల కోట్లను కేవలం వంద రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ జేఏసీ నాయకులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ​ఈ హామీని నెరవేర్చే దిశగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం తొలి విడతలో రూ.రెండు వేల కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్‌) బకాయిల మొత్తాన్ని వంద శాతం మంజూరు చేశామని వివరించారు. ఈ ఉద్యోగులకు సంబంధించి గతేడాది మే వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ చెల్లించినట్టు తెలిపారు. ‘‘ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ. నాలుగు వేల కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోందని తెలిపారు. ​ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ శ్రద్ధ, తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -