Saturday, May 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసర్ తో అందరికీ సమస్యే

సర్ తో అందరికీ సమస్యే

- Advertisement -

లంబాడీ, ఆదివాసీ, వలస కార్మికులకు నష్టం
సర్ తో ఎదురయ్యే సమస్యలపై అవగాహన పెంచుకోవాలి
దళితులు, మైనారిటీలు, మహిళల ఓట్లు పోయే ప్రమాదం : సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రత్యేక విస్తృత సవరణ (సర్ )తో లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య అని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ పైన అంద‌రు అవ‌గ‌హ‌న పెంచుకోవ‌డం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సర్ వ‌ల్ల‌ సామాన్యులు, పేద‌ల‌కు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయ‌కులు గుర్తించ‌డం మంచి ప‌రిణామమని అభినందించారు. సర్ లంబాడీ లు ,ఆదివాసీలు, వ‌ల‌స కార్మికులకు పెద్ద స‌మ‌స్య కావొచ్చన్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వలస పోయారనీ, అలాంటి వారితో పాటు మ‌హిళ‌ల‌కు కూడా సర్ వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదురుకావొచ్చని చెప్పారు. సర్ కారణంగా ద‌ళితులు, మైనారిటీలు, మ‌హిళ‌ల ఓట్లు పోయే ప్రమాదముందని అప్రమత్తం చేశారు. సర్ వ‌ల్ల త‌లెత్తే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారంపైన‌ సంపూర్ణ అవ‌గాహ‌న పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. బూత్ ఎన్ రోల‌ర్ సాయంతో గ‌తంలో 90 రోజుల్లో 45 ల‌క్ష‌ల డిజిట‌ల్ మెంబ‌ర్ షిప్ చేయించామనీ, ఎక్కువ స‌భ్య‌త్వం న‌మోదు చేయించిన వారికి రాహుల్ గాంధీ తో స‌న్మానం చేయించామని ఆయన గుర్తుచేశారు. గ‌తంలో కాంగ్రెస్ స‌భ్య‌త్వంలో కీల‌క పాత్ర పోషించిన ఎన్ రోల‌ర్స్ ను స ర్ విష‌యంలో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలని సీఎం సూచించారు.

డిజిట‌ట్ మెంబ‌ర్ షిప్ కోసం ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఇన్ చార్జీని నియ‌మించి నిరంత‌రం పర్య‌వేక్షించామని తెలిపారు. సర్ కోసం 119 నియోజ‌క‌వ‌ర్గాలు, 17 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్ చార్జీలను నియ‌మించాలనీ, అసెంబ్లీ ఇన్ చార్జీలు త‌ప్ప‌నిస‌రిగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. ఇన్ చార్జీలు సరిగ్గా ప‌ని చేస్తే ఒక్క ఓటు కూడా
తొలగించకుండా అడ్డుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఇన్ చార్జీ మంత్రులు ప్ర‌తి 10 రోజులకు ఒక రోజు పార్టీ కార్య‌క్ర‌మాల కోసం పూర్తిగా ప‌నిచేయాలనీ, క్షేత్ర స్థాయికి వెళ్లి కార్య‌క‌ర్త‌ల‌ను కలవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తాను కూడా 10 రోజుల‌కోసారి క్షేత్ర స్థాయిలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుస్తాననీ, నెలలో మూడు రోజులు పార్టీ కార్య‌క‌ర్త‌ల కోసం స‌మ‌యం కేటాయిస్తానని తెలిపారు. తనతో పాటు ఎవరికి మినహాయింపు ఇవ్వొద్దనీ, పార్టీ కోసం అందరూ ప‌ని చేయాల్సిందనని తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేష‌న్ చైర్మెన్లతో సహా ప్ర‌తి ఒక్క‌రు పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. మాజీ పీసీసీ అధ్య‌క్షుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాలని కోరారు. దాదాపు గా నామినేటేడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశామనీ, పార్టీ త‌రుపున ప్రస్తుతం వేలాది మంది స‌ర్పంచ్ లు, మున్సిప‌ల్ చైర్మెన్లు, కౌన్సిల‌ర్లు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. వ‌ల‌స‌లు పోయిన వారి ఓట్లు పోకుండా పార్టీ నాయ‌కులంతా స‌మ‌న్వ‌యం తో జాగ్రత్త పడాలని కోరారు. నాయ‌కులు క్షేత్ర‌స్థాయికి వెళ్తేనే కార్య‌క‌ర్త‌లు బూత్ స్థాయికి వెళ్తారని తెలిపారు. రాజ్య‌స‌భ స‌భ్యులు, ఎమ్మెల్సీల‌కు హైద‌రాబాద్ ప‌రిధిలో బాధ్య‌త అప్ప‌గించాలనీ, న‌గ‌ర‌ ప‌రిధిలోని 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో సర్ పైన అసెంబ్లీల వారీగా సమావేశాలు పెట్టాలని సూచించారు. సర్ పైన మ‌హిళా కాంగ్రెస్ త‌రుపున క్ల‌స్ట‌ర్ల వారీ గా స‌మావేశాలు నిర్వ‌హించాలన్నారు.

పీసీసీ అధ్యక్ష‍ుడి ఆదేశాలను అందరం పాటించాల్సిందే..
వారానికి ఒక రోజు మంత్రులు పార్టీ పనులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి సూచించారు. తాను కూడా వారానికి ఒక రోజు పీసీసీ అధ్యక్ష‍ుడు కేటాయించిన నియోజకవర్గంలో పాల్గొంటానని తెలిపారు. పార్టీ నిర్మాణంలో ప్రతిష్టపరచడంలో భాగస్వాములు కావాలన్నారు. పీసీసీ అధ్యక్ష‍ుల ఆదేశాలను అందరం పాటించాలని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు చేస్తున్న పనులపై మీనాక్ష‍ి నటరాజన్‌ ‌సమీక్ష‍ించాలని కోరారు. 
దాదాపు గా నామినేటేడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశామనీ, పార్టీ త‌రుపున ప్రస్తుతం వేలాది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -