Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటు దీటుగా అంగన్వాడి కేంద్రాలలో విద్యను అందిస్తున్నాం

ప్రయివేటు దీటుగా అంగన్వాడి కేంద్రాలలో విద్యను అందిస్తున్నాం

- Advertisement -

– ఐసిడిఎస్ అధికారి సిడిపిఓ ఎల్లయ్య
నవతెలంగాణ – తొగుట
: ప్రయివేటు పాఠశాలకు దీటుగా అంగన్వాడి కేంద్రాల లో విద్యను అందిస్తున్నామని ఐసిడిఎస్ అధికారి సిడిపిఓ ఎల్లయ్య అన్నారు. శనివారం మండలంలోని ఎల్లారెడ్డి పేట అంగన్వాడీ కేంద్రంలో “అమ్మ మాట అంగన్వాడి బాట” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు న్నర సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో చేర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాని కి వచ్చిన తల్లులకు అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్య గురించి తెలిపారు. అంగన్వాడి కేంద్రంలోని నెలలో జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఈసీసీఈ డే గురించి చెప్పారు. అంగన్వాడీ కేంద్రం లో పిల్లల తల్లులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ర్యాలీ నిర్వ హించారు. రెండున్నర సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్చుకున్నారు. వారికి యూనిఫామ్ అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంపురం రమేష్, ఉప సర్పంచ్ గౌసుద్దీన్, పంచాయతీ కార్యదర్శి రమేష్, వార్డు సభ్యులు బుర్ర భారతమ్మ నిరుటి నవనీత, పుల్లోళ్ల ఎల్లవ్వ, వివో లీడర్, ఆరోగ్య లక్ష్మి కమిటీ సభ్యులు, అంగ న్వాడీ టీచర్లు ఏ. కళావతి, ఏం. రాణి, ఎన్. భాగ్య, ఆయాలు జి. అంజమ్మ, ఏ. సుజాత, సీహెచ్. మంజుల, ఆశా కార్యకర్త ఆర్. కనకవ్వ, గర్భిణీలు, బాలంతలు, పిల్లల తల్లులు, చిన్న పిల్లలు తదిత రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -