Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు..!

రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు..!

- Advertisement -

– మండల పార్టీ అధ్యక్షులు చీర సత్యనారాయణ 
నవతెలంగాణ – బొమ్మలరామారం
: తూకంలో అవకతవకలకు పాల్పడిన, రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చీర సత్యనారాయణ అన్నారు. మండలంలోని ప్యారారం గ్రామంలోని ఐకెపి సెంటర్ ని ఆయన శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.సెంటర్లో తూకంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రైతులను మోసం చేస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఒక బ్యాగుకు 41. 300 గ్రామ్స్ మాత్రమే తూకం వేయాలని ఈ ఐకెపి సెంటర్లో 42.200 గ్రామ్స్ తూకం వేస్తూ ఉండటంతో రైతులు సుమారు ఒక బస్తా పైన ఒక కిల వడ్లను రైతులు నష్టపోతున్నారని సెంటర్ వారు అంతా వారి ఇష్టానుసారంగా రైతులను భయభ్రాంతులకు గురిచేసి తూకం వేస్తున్నారని ఈ ఐకెపి సెంటర్ నిర్వహకులపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్డీవో, దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకునేలాగా చేస్తానని ఆయన రైతులకు హామీని ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల పోరం మండల అధ్యక్షులు దాసరి సూర్యప్రకాష్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి సభ్యులు రాజేశ్వర్ యాదవ్, మాజీ అధ్యక్షులు మల్లేశం, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నందరాజు గౌడ్, ఉప సర్పంచ్ల పొరం మండలాధ్యక్షులు సుదర్శన్, మాజీ ఎంపిటిసి శ్రీహరి నాయక్, జూపల్లి శ్రీకాంత్, మచ్చ అరవింద్ గౌడ్, సురేష్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -