Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మా గ్రామ ఇసుకకు అనుమతి ఇవ్వాలి

మా గ్రామ ఇసుకకు అనుమతి ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మా గ్రామ శివారు ఇసుక.. మాకే కావాలి.. వేరే ఊరి ఇసుక మాకొద్దు’ అంటూ శనివారం బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామస్థులు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సవాయిసింగ్కు వినతిపత్రం అందజేశారు. గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, గ్రామస్థులు మాట్లాడుతూ. మా గ్రామానికి సుమారు కిలో మీటరు దూరంలో ఉన్న మంజీరనది మా శివారులో ఉన్న  ఇసుక మాకు కావలని డిమాండ్ చేశారు. మండలంలోని చించోలి గ్రామం నుంచి ఇసుక రవాణా చేయడం ద్వారా ఒక్కో ట్రాక్టర్కు రూ 3 వేల భారం పడుతుందన్నారు. బారంగెడ్గి గ్రామం నుంచి ఇసుక తీసుకోటానికి అనుమతులు ఇస్తే ఒక్కో ట్రాక్టర్కు రూ.1,600 ధరకు వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు తహసీల్దార్ను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -