సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
సమాజాన్ని చైతన్యపరిచి దశా దిశను చూపించే శక్తి సీఐటీయూకే ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని లేబర్ అడ్డా వద్ద సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికజెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సీఐటీయూ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కేవలం కార్మికుల వేతనాల పెంపు నియామకాల పరిరక్షణ కోసం మాత్రమే కాక కార్మిక వర్గాన్ని సమాజ మార్పు దిశగా చైతన్యపరిచే శక్తిగా ఎదిగిందని తెలిపారు.దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను బలహీనపరిచే ప్రయివేటీకరణ.. ప్రజాసంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కార్పొరేటీకరణ.. ఉద్యోగ భద్రతను దెబ్బతీసే లేబర్‌కోడ్స్, కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ విధానాల ద్వారా కార్మిక వర్గాన్ని అసంఘటితగా మార్చే కుట్రలను సీఐటీయూ వ్యతిరేకిస్తుందని తెలిపారు. దేశాన్ని కులం, మతం ప్రాతిపదికన పాలించే శక్తులకు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు..ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, మల్లయ్య, లక్ష్మీనారాయణ, నారాయణ, ఎమ్మెస్ నాయుడు ,సయ్యద్,వెంకటయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లాఅధ్యక్షులు కేశవులు, స్థానిక నాయకులు వల్లాల రవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సమాజాన్ని చైతన్యపరిచే శక్తి సీఐటీయూకే ఉంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



