నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో హట్కర్ సామాజిక ఆధ్వర్యంలో అహల్య బాయి హోల్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పలు గ్రామాల నుంచి హట్కర్ సామాజిక ప్రజలు తరలి రావడం జరిగింది. మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నీలు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతక ముందు అహల్యా బాయి హోల్కర్ చిత్ర పటానికి పూల వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. మరాఠా, హట్కర్ సామాజిక వక్తలు , ప్రజలు మాట్లాడుతూ ఆమే చేసీన ధైర్యసాహసాలు, పోరాటం , దుండగులను , దోపిడి దారులతో పోరాటం నేటికి దేశం మరువలేనిదని అన్నారు. 31మే నెల 1725 లో జన్మించడం జరిగింది. మరణం 13వ ఆగస్టు 1795 న అయింది. మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యంపు హోల్కర్ వంశంపు మహారాణి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి సమాజం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ మండలంలో ఘణంగా అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



