– ఎప్పుడు పూర్తవుతుందో అని ఎదురుచూస్తున్న జుక్కల్ ప్రజలు
– కొన్ని రోజులు బందు కొన్ని రోజులు పనులు కోనసాగు
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయి. కొన్ని నెలలుగా ప్రారంభించిన పనులు కొన్ని రోజులు శరవేగంగా కొనసాగినప్పటికీ ప్రస్తుతం నత్తనడకగా కొనసాగడం మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ఈ సీజన్లోనైనా పనులను పూర్తి చేసి జుక్కల్ మండల కేంద్రానికి కొత్త పంటలు వస్తాయని అనుకున్న గ్రామస్తులు పనులు వేగం పెరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలతో పనులు నిర్వహించినప్పటికీ అనుకున్న సమయానికి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పనులలో వేగం పెంచితే నియోజకవర్గంలో కావడంతో కొత్త అందాలు తెచ్చిపెట్టి మండలంలో వ్యాపారాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పడి జుక్కల్ ప్రాంతం అభివృద్ధి బాటలో ఉంటుందని, భావించిన ప్రజలకు ఎప్పటిలాగే అధికారులు నాయకులు గుత్తేదారుడు నిర్లక్ష్యం వేసి పనులు కొనసాగడం లేదని, గ్రామ ప్రజలు అంటున్నారు. ఈ పనులు ఇలాగే కొనసాగితే ఎన్ని నెలలు అయినా పూర్తి కాదని మండల కేంద్రంలోని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు గుతేదారుడు స్పందించి పనుల వేగం పెంచాలని వర్షాకాలం కంటే ముందే సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తిచేసి గ్రామానికి వన్నే తెచ్చే విధంగా తోడ్పాటు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జుక్కల్ మండల కేంద్రంలో కొన “సాగుతున్న” సెంట్రల్ లైటింగ్ పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



