మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా ‘స్కై’. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఈనెల 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రావాల్సి ఉండగా వాయిదా పడింది. అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు లిరికల్ సాంగ్స్‌తో మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల దృష్టిని కచ్చితంగా ఆకర్షిస్తుందని మేకర్స్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల, డీవోపీ – రసూల్ ఎల్లోర్, ఎడిటర్ – సురేష్ ఆర్స్, ప్రొడ్యూసర్స్ – నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు, డైలాగ్స్ , స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు, మ్యూజిక్ – శివ ప్రసాద్, లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక.
ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



