నవతెలంగాణ – భువనగిరి : జూన్ 1న సోమవారం రోజున ఉదయం 9 గంటలకు సింగన్నగూడెం చౌరస్తా స్తూపం వద్ద బట్టుపల్లి శ్రీనివాస్ 15వ వర్ధంతిని జయప్రదం చేయాలని పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆదివారం పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేదల ప్రజల కోసం ఇళ్లస్థలాలు పెన్షన్లు పేదల అవసరాల కోసం అందుబాటులో ఉండి పేదల కోసం పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాలని తెలిపారు. శ్రీనివాస్ 15వ వర్ధంతిని పార్టీ సభ్యులు, అభ్యుదయవాదులు వారి స్నేహితులు 700 సర్వే నెంబర్ ఇండ్ల స్థలాల బాధితులు సింగన్నగూడెం కాలనీ ఇందిరమ్మ కాలనీ నిరుపేదలందరూ పాల్గొని స్థూపం వద్దకు వచ్చి బట్టుపల్లి శ్రీనివాస్ కు జోహార్లు అర్పించాలని కోరారు. ఈ సమావేశంలో గంధ మల్ల మాతయ్య వనం రాజు, కల్లూరి నాగమణి, బర్ల వెంకటేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జూన్ 1న బట్టుపల్లి శ్రీనివాస్ 15వ వర్ధంతిని జయప్రదం చేయండి: మాయకృష్ణ
- Advertisement -
- Advertisement -


