Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాచారంలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

నాచారంలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

- Advertisement -

 నవతెలంగాణ – నాచారం: బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాచారం డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సి.కె. గార్డెన్ హాల్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ విస్తరణకు కీలకమని పేర్కొంటూ.. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను మరింత పెంచేందుకు ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి సభ్యత్వాల నమోదు చేపట్టాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కొత్త సభ్యులను చేర్చుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, ముత్యం రెడ్డి, విటల్ యాదవ్, బుచ్చన్న గౌడ్‌ మల్లికార్జున్ గౌడ్, గుండు రమేష్ గౌడ్, టేకులంపల్లి రామచంద్రతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -