నవతెలంగాణ -పరకాల : రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. ప్రజా సంక్షేమ వేదిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ప్రయాణాల్లో హెల్మెట్ మరియు సీటు బెల్టు ధరించడం ద్వారా ప్రమాదాల తీవ్రతను తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకే ప్రమాదమని, బాధ్యతారహితమైన ప్రయాణాలు వదిలి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి, నాయకులు శనిగరపు శ్రీనివాస్, సిహెచ్ కృష్ణ, ఎస్ సందీప్, సంగు రాజు, మడికొండ ఛత్రపతి, ఏకు అజయ్, బోట్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


