Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు

ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదు

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని ఎంపీడీఓ పి.వి. నర్సింహారెడ్డి, మండల వ్యవసాయ అధికారి మోహన్ సూచించారు. బుధవారం మండలంలోని తుక్కాపూర్, కాన్గల్, లింగంపేట గ్రామాలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయాని, చెరువులు పూర్తిస్థాయిలో నీరు నిండే పరిస్థితి లేదన్నారు. రైతులకు ఉన్న మొత్తం భూమిలో కొంత వరకు వరి పంటను సాగు చేయాలన్నారు. కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలు తక్కువ నీటితో పండే కంది, పెసర, మినుములు, జొన్న, పొద్దు తిరుగుడు పంటలు వేయాలని కోరారు. అదేవిధంగా రైతులు ఆయిల్ పామ్, కూరగా యల పంటల పండించెందుకు ద్రుష్టి సారించాలన్నారు. జల సిరి కార్యక్రమంలో భాగంగా రైతులు సోక్ పిట్, ఫార్మ్ పాండ్ నిర్మించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపిఒ నర్సింహా రెడ్డి, ఎంపీ వో విష్ణు, వెటర్నరీ డాక్టర్ లు వేన్నెల, హరికిషన్, ఏపిఎం బాబు రావు, ఐసీడీస్ సూపర్వేజర్, సర్పం చ్ చిక్కుడు కళావతి స్వామి, పిట్ల సత్తయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్ లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -