నవతెలంగాణ-నవాబుపేట
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం లింగం పల్లి గ్రామంలో సర్పంచ్ యాదగిరి పంచాయతీ కార్యదర్శి స్వేత ఆద్వర్యంలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందు తరాలకు మొక్కలు నాటి మానవాలికి ప్రాణవాయువునిచ్చే పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. గ్రామంలోని అంతర్గత రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలను తీసివేసి మొక్కలు నాటి ముందు తరాలకు పర్యావరణాన్ని అందించాలని సూచించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు ఖాళీ స్థలాలలో చెట్లను పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని, మొక్కలు అడవుల విస్తీర్ణం పెరిగేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ లక్ష్మమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ,వార్డు సభ్యులు లక్ష్మమ్మ నర్సింహులు యాదమ్మ లక్ష్మమ్మ ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాఘవ రెడ్డి బాల్ రెడ్డి రాములు శాంతయ్య ఫీల్డ్ అసిస్టెంట్ చెన్నయ్య నాయకులు పెంటయ్య నర్సింహులు బాలకిష్టయ్య నవీన్ గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు. మాజీ ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లింగంపల్లిలో మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



