Monday, June 1, 2026
E-PAPER
Homeజాతీయంమరోసారి పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

మరోసారి పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కిలోల సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజా పెంపు ప్రకటించడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో రూ.42 పెరుగుదలతో కొత్త ధర రూ.3,113.50గా మారగా, కోల్‌కతాలో రూ.53.50 పెరిగి రూ.3,255.50కి చేరింది. ముంబైలో ధర రూ.3,024 దాటింది. అంతర్జాతీయ ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక ఉద్రిక్తతలే ఈ పెంపునకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -