నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక దందా ఆగడం లేదు యథేచ్ఛగా కొనసాగుతోంది. రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పలు ట్రాక్టర్లను పోలీస్ అధికారులు పట్టుకొని సీజ్ చెసిన కొద్దిరోజులకే అక్రమ ఇసుక దందా నడుస్తోంది. అక్రమ ఇసుక వ్యాపారులు యంత్రాలతో ప్రకృతి వరమైన ఇసుకను దోపిడీ పొద్దంతా చేస్తున్నారు. తాడిచెర్ల మానేరులో ఓసిపిని తలపించేలా భారీగా గోతులు చేస్తూ ఇసుకను భూపాలపల్లి, జంగెడు, గొర్లవిడు, వదినపల్లి, కొంపల్లికి తరలిస్తూ అక్రమ ఇసుక వ్యాపారులు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సొమ్ము చేసుకుంటున్నారు.
ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, పారెస్ట్,పోలీస్ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి అక్రమ ఇసుక దందాకు ముకుతాడు వేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. లేదంటే రాబోయే కాలంలో భూగర్జజలాలు అడుగంటిపోయాయి. తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను తీసుకపోయే పేదలకు తాము అడ్డుచెప్పడం లేదని పలువురు చెబుతున్నారు.



