Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీచర్ల జీతాల్లో కోతలు సరికాదు

టీచర్ల జీతాల్లో కోతలు సరికాదు

- Advertisement -

ఆర్టీఐ జిల్లా కన్వీనర్ వేంకటేశ్వర్లు గౌడ్, కో కన్వీనర్ కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

హెల్త్ కార్డుల పేరిట ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించకుండానే ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడం సరికాదని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కో కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రులతో సమావేశం నిర్వహించకుండానే ఆరోగ్యకార్డులు, విధివిధానాలు తెలియజేయకుండానే ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసే ప్రీమియం రక్షణ టీచర్లను మోసగించే విధంగా ఉందన్నారు. విధివిధానాలు విడుదల చేసిన తర్వాత ప్రీమియం సంబంధించిన డబ్బులు జీతాల నుంచి కోత విధించాలని స్పష్టం చేశారు. ఈ పథకం ఇష్టంలేని వారికి మినహాయింపునివ్వాలని, భార్యభర్తలిద్దరూ ఉద్యోగులైనప్పుడు ఒకరి నుంచి మాత్రమే ప్రీమియం వసూలు చేయాలని కోరారు. ఆరోగ్య పథకం విధివిధానాలు, మార్గదర్శకాలు, ఆస్పత్రుల జాబితా, వ్యాధుల ప్రస్తావన ప్రకటించకుండానే జూన్ 2 నుంచి అమలు చేస్తున్నామని ప్రకటించడం శోచనీయమన్నారు. మార్గదర్శకాలను వెంటనే ప్రకటించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -