నవతెలంగాణ – భీంగల్
1994వ సంవత్సరంలో కేవలం కొద్ది మంది విద్యార్థులతో ప్రారంభమై, దినదినాభివృద్ధి చెందుతూ భీంగల్ మండలానికే వన్నె తెచ్చింది లిటిల్ ఫ్లవర్ స్కూల్. ఈ సంస్థ భీంగల్ పట్టణము, బాబాపూర్ గ్రామాల మధ్యన వెలిసింది. 1994 వ సంవత్సరంలో నర్సరీ నుండి 2 వ తరగతి వరకు స్థాపించిన ఈ విద్యా సంస్థ, 2003 సంవత్సరం నాటికి పదవ తరగతి ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే 100 శాతం ఉత్తీర్ణత సాధించిన టాప్ విద్యా సంస్థగా పేరు పొందింది. అప్పటినుండి విమర్శకుల మన్ననలను పొందుతూ పదవ తరగతి అప్ గ్రేడ్ అయిన తొలి సంవత్సరంలోనే విజయ దుందుభి మ్రోగించి తల్లిదండ్రుల మన్ననలను, విశేష ఆదరాభిమానాలను పొందిన ఘనత కేవలం లిటిల్ ఫ్లవర్ విద్యార్థులకే దక్కింది.
2000 సంవత్సరం నుండి 2003 వరకు 7వ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 2002 లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం విశేషం. విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం చేయకుండా నవోదయ, గురుకుల ప్రవేశ పరీక్షలకు సిద్ధంచేసి అందులో విజయం సాధించేలా శిక్షణ ఇవ్వడమనేది ఈ పాఠశాలకే సాధ్యమయ్యింది. విద్యారంగంలో చేస్తున్న విశేష కృషికి లిటిల్ ఫ్లవర్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. బ్రెయిన్ ఫీడ్ సంస్థ దేశవ్యాప్తంగా 500 ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయగా అందులో ఒకటిగా భీంగల్ లిటిల్ ఫ్లవర్ నిలిచి జాతీయ స్థాయిలో ఉత్తమ పాఠశాలగా నేషనల్ ఎక్సలెన్స్ అవార్డును కైవసం చేసుకుంది. న్యూ ఢిల్లీ లోని ప్రముఖ జాతీయ పరిశోధనా సంస్థ ప్రైమ్ టైం రీసెర్చ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా గ్లోబల్ ఐకాన్ – 2024 అవార్డును, బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్కూల్ ఇన్ అకడమిక్ ఎక్సలెన్స్ – 2025 కేటగిరిలో ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు సొంతం చేసుకుంది. విద్యారంగంలో గత 32 సంవత్సరాలుగా చేస్తున్న విశేష కృషికి గాను గుర్తింపుగా చెన్నై లోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు పాఠశాల కరెస్పాండెంట్ షఫీ కి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్ కరస్పాండెంట్ షఫీ మాట్లాడుతూ.. లిటిల్ ఫ్లవర్ లో విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఐ ఏ యస్, ఐ పి యస్, వంటి ఉన్నతోద్యోగాల్లోనే కాకుండా సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని తెలిపారు. విశాలమైన సొంత పాఠశాల భవనం, ప్రతి తరగతిలో పరిమిత విద్యార్థుల సంఖ్య, ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు చక్కని విద్యను అందించి విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పారు. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పట్టు సాధించేలా ప్రతి సంవత్సరం సైన్స్ ఫెయిర్ నిర్వహించడం, విద్యార్థులకు కృత్రిమ మేధ ( ఏ ఐ) పై అవగాహన పెరిగేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తున్నామని ఆయన వివరించారు. ఇక ముందు కూడా ఎప్పటిలాగే తల్లిదండ్రులు కూడా సహకరించాలని, గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన విద్యాసంస్థకు ఎన్నో అవార్డులు రావడం ద్వారా తనపై ఎంతో గురుతర బాధ్యత పెరిగిందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సమాజంలో మంచి గుర్తింపు రావడం కేవలం విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల ద్వారా మాత్రమే సాధ్యమయ్యిందని, వారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఆయన హామీ ఇచ్చారు.



